పూల వెనక మనసు

  • 216
  • 1
  • 57

పూల వెనక మనసురావులపాలెం కోనసీమకు ముఖద్వారం. అరటిపళ్ళ మార్కెట్ కి ముఖ్యమైన స్థలం. జాతీయ రహదారి మీద ఉన్న ఈ నగరం , అటు విజయవాడ వైపు వెళ్లే బస్సులు ఇటు రాజమండ్రి వెళ్లే బస్సులు కోనసీమ వైపు వెళ్లే బస్సులు లారీలు టాక్సీ లతో ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. సాయంకాలం ఆరు గంటలైంది. ఒక వ్యక్తి సెంటర్లో నిలబడి చేతి మీద మల్లెపూలు దండలు వేసుకుని" మల్లెపూలు మల్లెపూలు అంటూ అరుస్తూ లారీలు, బస్సులు, కార్లు కూడా పరిగెడుతున్నాడు . అతని పేరు కోటయ్య. పేరులో కోటి ఉంది గాని తొడుక్కోడానికి సరైన చొక్కా కూడా లేదు. చేసేది పూల వ్యాపారి దగ్గర పని. ఏ కాలంలో పూలు ఆ కాలంలో అమ్ముతుంటాడు. అది కూడా రహదారి సెంటర్లో ఆగిన వాహనాలు దగ్గరకొచ్చి పట్టుకొచ్చి అమ్ముతుంటాడు.  ఇంతలో హైదరాబాద్ వెళ్లే బస్సు వచ్చి ఆగింది.బస్సులో నుంచి ఒక స్త్రీ మల్లెపూలు ఎంత? అని