అమ్మ@న్యాయమూర్తి

అమ్మ@న్యాయమూర్తి"మీరు విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నారు?" అని ప్రశ్నించింది జడ్జి రాజ్యలక్ష్మి, కోర్టు బోనులో నిలుచున్న ఊర్మిళ అనే యువతిని.ఊర్మిళ దగ్గర నుండి సమాధానం రాకపోవడంతో, మరో ప్రశ్నలు వరుసగా వెల్లువెత్తాయి."మీ భర్త మిమ్మల్ని బాధిస్తున్నారా? ప్రేమగా చూడడంలేదా? పెళ్లి అయి ఎంతకాలమైంది?"అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం —"మా పెళ్లయి ఎనిమిది నెలలైంది."జడ్జి రాజ్యలక్ష్మి ఒక్కసారి ఉలిక్కిపడింది. "ఎనిమిది నెలల కాపురానికే విడాకులా?""మీది పెద్దలు కుదిర్చిన పెళ్లి లేదా ప్రేమ వివాహమా?""పెద్దలే చూశారు మేడం," అని నెమ్మదిగా చెప్పింది ఊర్మిళ."అయితే పెళ్లి చూపుల్లో మాట్లాడుకోలేదా? తిరగలేదా కలసి?""తిరిగాం మేడం... పెళ్లి ముందు కలిసి సినిమాలు, షికార్లు చేశాం. పెళ్లి ఘనంగా జరిగింది.""అయితే సమస్య ఏమిటి?""హనీమూన్‌కి తీసుకెళ్లమన్నాను. ముందు ఒప్పుకున్నారు పెళ్లయ్యాక ఎన్నో మినహాయింపులు చెప్పాడు. ప్రతిరోజూ అదే గొడవ. మాట తప్పితే నాకు కోపం ఎక్కువ. అది నాకు తెలుసు మేడం. పుట్టినరోజుకి ప్రామిస్‌ చేసిన పార్టీ కూడ మరిచిపోయాడు. ఇవన్నీ నా మనసు కలతపరిచాయి.""సరే,