తేదీ 29th ఆగస్ట్ 2007 అందరూ ఎవరిపన్నుల్లో వారు బిజీ గా ఉన్నారు..ఒక హెయిర్ కటింగ్ షాప్ లో,కొంతమంది న్యూస్ పేపర్ చదువుతున్నారు..-మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు, -ఇండియా ని గెలిపించిన మహేంద్రసింగ్ ధోని,-ప్రముఖ హైప్నోటీస్ట్ అభిరామ్ ని తాను అందించిన సేవలకు గాను సత్కరించిన ప్రభుత్వం..సడన్ గా టీవీ లో ఫ్లాష్ న్యూస్, సిటీ లో ఫేమస్ బంగారు దుకాణం లో దొంగలు పడి, చాలా బంగారం దోచుకెళ్లారు అని...పోలీసులు దొంగతనం జరిగిన షాప్ కి వెళ్లి అన్ని క్లూ లు సేకరిస్తున్నారు, ఎక్కడ కూడా దొంగకు సంబందించిన క్లూ మాత్రం దొరకలేదు..పోలీసులు మరియు క్లూస్ టీమ్ ప్రకారం ఇది ఎవరో ప్రొఫెషనల్ చేసిన పని అని నిర్ధారిస్తారు..పోలీసులు ఆ దొంగతనం చేసిన దొంగ కోసం గాలిస్తున్నారు..సీసీటీవి footage కోసం కూడా చూస్తున్నారు,కానీ ముందుగానే , దొంగతనం జరిగిన రోజు,ఆ ఏరియా లో ఆ టైం లో కరెంట్ లేకుండా జాగ్రత్త పడ్డాడు