సైనికుడు" ఏరా సుధాకర్ రేపే కదా నీ ప్రయాణం. మళ్లీ ఎప్పుడు వస్తావు? ఈసారి ఎందుకో చాలా బెంగగా ఉంది. నేను మీ అమ్మ ఇలా మంచాన్ని పడి ఉన్నా ము. నువ్వేమో చాలా దూరంగా ఉన్నావు. అప్పుడు మేము చెప్పిన వినలేదు నీ స్నేహితులందరినీ చూసి నువ్వు ఈ ఆర్మీలో జాయిన్ అయ్యావు. మేం పెద్దవాళ్ళం అయిపోయి ఉన్నాము.మా గురించి ఏ కబుర్లు తెలిసిన నీకు వెంటనే రావడం కుదరదు. ఎక్కడో వేల మైళ్ల దూరం నుంచి రావాలి. అప్పటివరకు మమ్మల్ని ఆ పెట్టెలో పెట్టి ఉంచుతారు. అలాంటివన్నీ తలుచుకుంటే మాకు చాలా భయంగా ఉంది. ఉన్న ఒక్క కొడుకు చేతితో ఉత్తరక్రియలు జరిపించుకోవాలని కానీ వేళ కు నువ్వు అందుకో లేకపోతే యిన్నాళ్ళ నుంచి చాకిరి చేస్తున్న కోడలు పిల్ల చేతితో ఆ కార్యక్రమం జరిగేలా చూడు. ప్రస్తుతం అది కొడుకు లాగే చూసుకుంటుంది. వేరొకరి చేత కార్యక్రమం