పెద్దల కథ"ఏవండి రామయ్య గారు! ఎందుకొచ్చిన అవస్థ . రోజు క్యారేజీ తెప్పించుకుని తినడం ఆరోగ్యం బాగోలేక పోతే వాళ్లని వీళ్ళని బతిమాలి ఆసుపత్రికి తీసుకు వెళ్ళమనడం ఇవన్నీ ఎందుకండీ హాయిగా నలుగురు కొడుకులు ఉన్నారు కొడుకులు దగ్గరికి వెళ్లి పొండి సీతమ్మ గారు మీరేనా చెప్పండి ! అంటూ క్యారేజీ తీసుకొచ్చిన రామశాస్త్రి మాటలకి ఆ దంపతులు ఇద్దరు పేలవంగా ఒక నవ్వు నవ్వేరు.ఆ నవ్వు అర్థం ఏమిటో తెలియలేదు రామ శాస్త్రి కి. ఎప్పుడు ఏమీ మాట్లాడరు. నేను ఎప్పుడు ఏం అడిగినా ఇలాగే నవ్వుతారు అంటూ ఖాళీ క్యారేజీ తీసుకుని వెళ్లిపోయాడు రామశాస్త్రి.రామ శాస్త్రి కాదు ఊర్లో వాళ్ళందరూ కనపడినప్పుడల్లా ఆ మాటలు మాట్లాడినా ఆ దంపతులకు గుండె తీయని బాధతో మూలుగుతూ ఉంటుందిరామయ్య ఆ ఊర్లో ఒక ప్రభుత్వ స్కూల్లో టీచర్ గా పని చేస్తూ ఉండేవాడు. నలుగురు మగ పిల్లలకి ఉన్నత చదువులు చెప్పించి