ఆర్థిక శాస్త్రవేత్త

ఆర్థిక శాస్త్రవేత్తఇల్లంతా ఎంత సందడిగా ఉండేది. అమ్మమ్మ ఎప్పుడూ ఎవరో ఒకరి మీద కేకలు వేస్తూనే ఉండేది ఆ హాల్లో మంచం మీద కూర్చుని. గేటు తలుపు తీసిన చప్పుడైతే ఎవరు అంటూ గట్టిగా అరిచేది. ఆ హాల్ అంతా చిన్న పోయింది. ఇప్పుడేమో ఇలా! వీధిలో చాప మీద పడుకుంటే ఏదోలా ఉంది.అప్పుడే ఆఖరి శ్వాస విడిచి మూడు గంటలు అయింది . నిన్నటి వరకు మన మధ్య ఉన్న ఈమె ఇవాళ శవమై వాకిట్లో పడుకుంది అనుకుని బాధపడుతూ కూర్చున్నాడు చనిపోయిన సీతమ్మ గారి మనవడు రఘురాం. సీతమ్మ గారికి నలుగురు ఆడపిల్లలే. మగ పిల్లలు లేరు. అందుకే పెద్ద కూతురు కొడుకుని దత్తత చేసుకుని బంధువుల అమ్మాయిని సరళని ఇచ్చి పెళ్లి చేసింది. రఘురాం ఆ ఊర్లోనే టీచరుగా పనిచేస్తుంటాడు. తాతగారు ఇంట్లోనే కాపురం ఉంటాడు. మళ్లీ రఘురాం కూడా అందరూ నలుగురు ఆడపిల్లలే. సీతమ్మ గారు ఆడపిల్లలు భర్తలు