సరోజపందిట్లో జట్కా బండి వచ్చి ఆగింది. బండి ఆగగానే పిల్లలందరూ "వదిన వచ్చింది వదిన వచ్చింది "అంటూ ఆనందంగా కేరింతలు కొడుతూ బండి చుట్టూ మూగారు. ఆ బండి లోనుంచి కాళ్ళకి పసుపు రాసుకుని నుదుటన పెద్ద బొట్టు పెట్టుకుని గెడ కర్రకి చీర కట్టినట్లుగా ఉండే అమ్మాయి దిగింది. అక్కడ ఉన్న పిల్లలందరికంటే ఒక నాలుగు ఐదు ఏళ్లు పెద్ద ఉంటుంది. కానీ చిన్న వయసులోని పెళ్లి చేసేసారు కాబట్టి ఆ ఉమ్మడి కుటుంబానికి పెద్ద కోడలు అయిపోయింది. అందరితో ఆప్యాయంగా మాట్లాడడం , పిల్లలందరి తోటి కలిసిమెలిసి ఆడుకోవడం, మాటలో నెమ్మది, పెద్దల పట్ల గౌరవం చూసి మాధవరావు గారికి చాలా మంచి కోడలు దొరికింది అనుకునేవారు ఊరి వారందరూ. ఆ ఇంటి ఇల్లాలు రాజమ్మ నిజమైన వారసురాలు అనుకున్నారు బంధువులు. ఇంకా పసితనం వీడని వయస్సు భర్త అంటే ఏంటో తెలియని మనసు తల్లి ఆదరణలోనే పెరిగిన పసితనం తప్ప తండ్రి