కాలుష్యంకార్తీక పౌర్ణమి శుభవేళ లోకాలన్నీ వెన్నెల వెలుగులో మెరిసిపోతుంటే కైలాస పర్వతం తెల్లని వెన్నెల పరచినట్లు గా ఉంది . ఆ సమయంలో నదుల శబ్దాలు సంగీతంలా వినిపిస్తున్నాయి. వృక్షాలు సువాసన పంచుతున్నాయి. దిక్కులన్నీ మంచుతోటి మెరిసిపోతూ ఉన్నాయి. పక్కన పార్వతీదేవి , తలపైన గంగ, ఆకాశం మీద కార్తీక పున్నమి చంద్రుడు ఇంతటి అద్భుత వాతావరణంలో శివుడు పరవశుడై నాట్యం చేస్తున్నాడు. ఇంతలో ఏదో ఆర్తనాదం వినబడింది. నాట్యం ఆపేసి అటువైపు చూసిన శివుడుకి దూరం నుంచి వస్తున్న తన బిడ్డలు పంచభూతాలు, కొన్ని మూగజీవాలు కనబడ్డాయి. ఇదేమిటి ఆనందం అనుభవించవలసిన సమయంలో ఆర్తనాదం చేస్తూ పరిగెత్తుకొస్తున్నాయి అనుకుని పక్కనున్న పార్వతీ దేవితో ఇలా అన్నాడు .శివుడు: చూడు పార్వతి నా బిడ్డ లేదో ఆపదలో ఉన్నట్టున్నారు ఎప్పుడూ లేనిది ఇలా నా దగ్గరికి పరిగెత్తుకుని వస్తున్నారు. పాపం ఏ ఆపద వచ్చిందో ఏమో! నేను పలకరించి వస్తాను అంటూ ముందుకు కదిలాడు. పార్వతి: నాకు