గుడిఉదయం 5:00 అయింది. ప్రతిరోజు లాగే రాఘవచార్యులు గోపాల కృష్ణుడి గుడి తలుపులు తీసి దేవుడి మీదనున్న నిర్మాల్యం తీసి బయట పడేసి శుభ్రంగా తుడుచుకుని ఘంటసాల గారి భగవద్గీత శ్లోకాలు మైకులో వింటూ స్వామి వారికి ఉదయం జరిపే పూజలు యధావిధిగా చేసి తన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పాలు పళ్ళు నైవేద్యం పెట్టి ఒక్కసారిగా వీధిలోకి తొంగి చూసాడు. ఎవరైనా భక్తులు వస్తున్నారా అని!. అదేo విచిత్రమో! కార్తీకమాసo పుణ్యదినాలైనప్పటికిపెద్దగా ఎవరూ కనపడలేదు. రోజుకి మహా అయితే పదిమంది వస్తే గొప్ప. అదేమిటి ఇది అతి పురాతన దేవాలయం. ఇంత పుణ్య దినాల్లో కూడా ఎక్కువగా ఎవరు గుడికి రావట్లేదు ఏమిటి ? అనుకుంటూ ప్రతిరోజు మనసులో మధన పడసాగాడు రాఘవాచార్యులు. రాఘవచార్యులు తెలుగు మాస్టారుగా 35 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యి అనువంశికంగా వచ్చిన అర్చకత్వం తీసుకుని తన స్వగ్రామంలో ఉంటూ ప్రభుత్వo ఇచ్చే