బహుమతి" నాన్న అమ్మ బర్తడే దగ్గరకు వచ్చేస్తుంది. అమ్మకి ఇది స్పెషల్ బర్తడే. అరవై సంవత్సరాలు వస్తున్నాయి. ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వు నాన్న అంటూ విదేశాల్లో ఉంటున్న రామారావు పిల్లలు ఒకరి తరువాత ఒకరు ఫోన్ చేస్తూ హడావుడి చేస్తున్నారు రెండు రోజుల నుంచి.ఏం గిఫ్ట్ ఇవ్వాలి ?ఎంత ఆలోచించినా రామారావుకి ఏమి ఆలోచన తట్టలేదు. వెండి బంగారాల మీద మమకారం లేదు రామారావు భార్య సీతాదేవి కి. ఖరీదైన పట్టు చీరలు అంటే అసలు ఇష్టం లేదు. ఈ వయసులో గిఫ్ట్లు ఏం చేసుకుంటుంది. పుణ్యక్షేత్రాలు టూర్లు అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు సీతాదేవికి. భర్త తెచ్చిన సంపాదనని పొదుపుగా వాడుకుని పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి పేరంటాలు చేసి కుటుంబానికి గౌరవ మర్యాదలను తీసుకొచ్చిన సగటు భారతీయ మహిళ సీతాదేవి.రామారావు గవర్నమెంట్ ఆఫీసులో ఒక చిరుద్యోగి. వెనక ఆస్తిపాస్తులు ఏమీ లేవు. మూడు గదుల కొంపలో ముగ్గురు ఆడపిల్లలతో