మారిన పల్లె పల్లెటూరు అనగానే చుట్టూ పచ్చని పొలాలు ,పిల్ల కాలువలు పెద్ద కాలువలు ,కాలువగట్లు ,కొబ్బరి తోటలు, అరటి తోటలుమామిడి తోటలు ,చల్లటి పైరగాలి,పెద్ద పెద్ద పెంకుటి ళ్లు ఇలా బాపూగారి బొమ్మలా ఉంటాయి .సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. మనుషుల మధ్య బంధాలు అనుబంధాలు కృత్రిమత్వం ఎక్కడ ఉండదు. సాయం అంటే ఒక అడుగు ముందు సహాయం అంటే అందరికంటే ముందు ఉండే జనంతో నిండుగా ఉండేది పల్లెటూరు.చేతిలో చెర్నాకోలు పట్టుకుని నాగలి కి రెండు ఎడ్లు కట్టుకునివాటిని అదిలిస్తూ బురద తొక్కుకుంటూ పొలం దున్నుతూ చేతులు బొబ్బలెక్కిన కర్తవ్య నిర్వహణ ఆపకుండా ఆ పొలంలో బంగారం పండించడానికి కృషి చేసే రైతన్నల అడ్డా మన పల్లెటూరు.పల్లె పదాలు పాడుకుంటూ ఊడ్పు చేలో మొక్కలు నాటే పల్లె పడుచులు ఉండే ఊరు పల్లెటూరు.పైరు ఎదిగి పూతపూసి గింజ కాసి గింజల బరువుకి నడువొంగి నపైరు తల్లిని కోత కోసి జోడెడ్లతో