రహస్యం

  • 357
  • 99

తా తలనాటి ఆస్తి, దాయాదుల మధ్య, కోర్టులలో నలిగి నలిగి దివాకరానికి పదిలక్షలు వచ్చాయి. ఆ పది లక్షలతో దివాకరం తన తల్లి పేరు మీద ఫిక్స్ డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ లు చేయించాడు. "నాకెందుకురా రేపో మాపో పోయ్యేదాన్ని ఇన్ని లక్షలు నా మీద పెట్టావు" అడిగింది దివాకరం అమ్మ మహాలక్ష్మమ్మ."అదేమిటమ్మా! అలా అంటావు. ఇది నాన్న గారి డబ్బు. నీ పేరు మీద ఉండడమే ధర్మం." చెప్పాడు ధర్మరాజులా దివాకరం. కొడుకు తనమీద చూపించిన ప్రేమకు మహాలక్క్ష్మమ్మకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కొడుకు తనమీద చూపించిన ప్రేమను నలుగురితో చెప్పుకోడానికి ఎదురింటికి వెళ్ళింది.తల్లికొడుకుల సంభాషణను ప్రక్క గదిలోంచి వింటున్న దివాకరం భార్య రాణి చండీరాణియే అయ్యింది. ఉక్రోషంతో దివాకరం దగ్గరకెళ్ళి "ఎప్పుడైనా పట్టు చీరో, నగలో కొనమని నేను అడిగితే డబ్బులు, దాని విలువ అంటూ గంటలు గంటలు క్లాసు పీకే నువ్వు రేపో మాపో గుంటలోకి వెళ్ళే