మట్టిలో మాణిక్యం

  • 375
  • 87

మట్టిలో మాణిక్యంమధ్యాహ్నం మూడు గంటలు అయింది  ఇందిరా గాంధీ లేడీస్ క్లబ్ ఆవరణ అంతా హడావిడిగా ఉంది. కార్యకర్తలంతా అటు నుంచి ఇటు నుంచి అటు తిరుగుతూ సభా ప్రారంభానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ ముఖ్య అతిధి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు . "ఆ బ్యానర్ ఎదురుగుండా కట్టండి అని చెప్పి ఒక్కసారి బ్యానర్ కేసి చూసిన లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ అదేమిటి ? ముఖ్యఅతిథి పేరు కింద జిల్లా కలెక్టర్ అని రాయలేదు ఏమిటి? అని అడిగింది. " లేదు మేడం కలెక్టర్ గారు ఒక సాధారణ మహిళ గానే ఈ కార్యక్రమానికి వస్తారట. అందుకని పేరు మాత్రమే రాయమన్నారు అంటూ సమాధానమిచ్చింది లేడీస్ క్లబ్ సెక్రటరీ. ఆ జిల్లాకి కలెక్టర్ ఆయన శ్రీమతి సుమతి ఆరోజు ముఖ్య అతిథి. ఇంతకీ జరగబోయే ఫంక్షన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సరే అనుకున్న సమయానికి కలెక్టర్ గారు రావడం వేదిక మీదకి ఆహ్వానించడం