కలలో కళ్యాణం అబ్బా ! ఎంత బాగుంది ఈ శుభలేఖ.అయినా ఈ శుభలేఖ ఎవ్వరూ పంపించారు అనుకుని చూసేసరికి మిథిలా నగరం నుంచి వచ్చినట్లు కనబడుతోంది.అలకాపురి లో చుట్టాలున్నారు గాని మిథిలాపురిలో ఎవరున్నారు అబ్బా ! అనుకుని వరుడు పేరు చూసేసరికి రాములోరి పెళ్లికి ఊరంతా పెద్దలే కదా అనుకుని బయలుదేరా బాల రాముడిని చూడొచ్చని ముచ్చట పడ్డాను.వధువు ఇంకెవరు మా సీతమ్మ తల్లి కదా! పర స్త్రీని కూడా కన్నెత్తి చూడని మహా పురుషుడు రాముడు. ఏకపత్నివ్రతుడు. అయినా పుట్టినరోజు నాడే కళ్యాణం జరిగే అదృష్టం ఈ లోకంలో ఎంత మందికి ఉంటుంది. రామచంద్ర మూర్తి లాంటి మహనీయులకు తప్పితే. ప్రతి ఏట కళ్యాణం దేవుళ్ళకే మనలాంటి వాళ్ళు చేసుకుంటే కారాగారానికే. అబ్బా దేవుడి పెళ్లి శుభలేఖ అందుకున్నాను. తప్పకుండా వెళ్లాలి . మియాపూర్ అడ్రస్ తెలుసు కానీ మిథిలాపురి నాకు తెలియదు. కళ్యాణం చూసే అదృష్టం ఉంటే దేవుడే అక్కడకి తీసుకెళ్లి పోతాడు. అందుకనే