". ఒంటరితనం 2.0 "" అమ్మ నువ్వేమీ బెంగ పడకు. నేను ప్రతిరోజు వీడియో కాల్ చేస్తుంటాను గా. నువ్వు కావాలంటే అమెరికా రావచ్చు నేను కూడా ఇండియా రావచ్చు ఇప్పుడు నేను ఉద్యోగస్తుడిని. ఏమి ఇబ్బంది లేదు అంటూ పార్వతమ్మ గారి కొడుకు రాకేష్ ధైర్యం చెబుతూ అమెరికాకి విమానం ఎక్కేసాడు. రాకేష్ కి అమెరికాలో ఉద్యోగం రావడం తో ఆర్థికపరమైన ఇబ్బందులు తొలిగిపోయినప్పటికీ పార్వతమ్మ గారు ఒంటరిది అయిపోయింది . రాకేష్ తండ్రి పోయినప్పటి నుంచి ఎంతోమంది రెండో పెళ్లి చేసుకున్న సలహా ఇచ్చినప్పటికీ ఒప్పుకోకుండా అన్నీ తానై పెంచుకుంటూ వచ్చింది రాకేష్ ని .మూడో వ్యక్తి ఇంట్లో లేకపోవడం మూలంగా రాకేష్ బాగా అలవాటయ్యాడు పార్వతమ్మకి. ఇద్దరు కలిసి భోజనం చేయడం కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోవడం అలవాటు. అస్తమాను అమ్మ అమ్మ అంటూ పార్వతమ్మ కొంగు పట్టుకుని తిరిగేవాడు రాకేష్. ఇప్పుడు రాకేష్ అమెరికా వెళ్ళిపోవడంతో తీవ్రమైన వంటరితనంతో బాధపడుతోంది పార్వతమ్మ.