సత్తిబాబు " పొద్దుటి నుంచి మన ఇంట్లో కరెంట్ లేదండి. ఇవాళ అసలు ఏ పని అవలేదు వంటింట్లో. మన ఇన్వెర్టర్ కూడా పనిచేయట్లేదు అంటూ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే సంధ్య చెప్పిన మాటలకి రాజారావు గుండెల్లో రాయి పడింది. అసలే వేసవికాలం రాత్రి ఏసీ లేకుండా ఎలాగా అని ఆలోచిస్తూ అసలే ఈ ఊరికి కొత్త ఇప్పుడు ఎలక్ట్రీషియన్ నెంబర్ ఎలాగా అని అనుకుంటూ రాజారావు ఎదురింటి ప్లాట్ తలుపు తట్టాడు. ప్లాటు తలుపు తీయగా నే " నమస్కారమండి నా పేరు రాజారావు నేను ఎదురింటిలో కొత్తగా దిగా ను. కొంచెం మీకు తెలుసున్న ఎలక్ట్రీషియన్ నెంబర్ ఏదైనా ఉంటే ఇవ్వండి మా ప్లాట్ లో కరెంట్ లేదంటూ చెప్పిన మాటలకి తలుపు తీసిన పెద్దమనిషి వెంటనే తన సెల్ లో వెతికి ఇతని పేరు సత్తిబాబు చాలా బాగా చేస్తా డు అంటూ నెంబర్ ఇచ్చాడు. థాంక్స్ అండి అంటూ