సింగిల్ పేరెంట్

  • 675
  • 1
  • 243

సింగిల్ పేరెంట్." లేదమ్మా సుధని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆ అమ్మాయి అటువంటి అమ్మాయి కాదు. పదిమంది కావాలనుకునే అమ్మాయి. నలుగురిలో పెరిగిన పిల్ల. నిన్ను అంత మాట అంది అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అలాంటి మాట బయటికి రావడానికి కారణాలు ఏమిటి? నేను పెళ్లయిన మొదటి రోజు చెప్పాను నాకున్న బాధ్యత గురించి. మనం కూడా కొన్ని చూసి చూడనట్టు ఉండాలి. కొత్తగా మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల మనతోటి కలిసిమెలిసి ఉండడానికి కొద్ది రోజులు సమయం పడుతుంది అంటూ కొడుకు రాజేంద్ర చెప్పిన మాటలు వినేటప్పటికీ రాజేంద్ర తల్లి రాధ మంచం మీద పడుకుని ఆలోచనలో పడింది."రాజేంద్ర లో ఎంత మార్పు వచ్చింది. ఇదివరకు ఎక్కువగా మాట్లాడే వాడు కాదు. ఇప్పుడు ప్రతి మాటకి విశ్లేషణ ఇస్తున్నాడు. కోడలు సుధని వెనకేసుకొస్తున్నాడు. ఏదో చెప్పాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాడు. చెప్పలేకపోతున్నాడు. నేను బాధపడుతున్నానని పూర్తిగా