ఆఖరి ఉత్తరం

  • 384
  • 1
  • 135

ఆఖరి ఉత్తరంఇల్లంతా నిశ్శబ్దం అయిపోయింది. పది రోజుల నుండి బంధువులతోటి పిల్లలతోటి కర్మకాండలతోటి హడావిడిగా ఉండే ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్లిపోవడంతో ఇల్లు బోసిగా ఉంది. ముప్పై ఐదు సంవత్సరములు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేసి పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి రెండు సంవత్సరాల క్రితమే పదవి విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న రామారావు మాస్టారు కాలం చేయడంతో భార్య పార్వతమ్మ ఒంటరిగా అయిపోయింది పిల్లలందరూ రామారావు మాస్టర్ రాసిన వీలునామా చదువుకుని హాయిగా ఎవరు ఇ ళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. ఇక మిగిలింది లంక అంత కొంప భార్య పార్వతమ్మ. పిలిస్తే పలికే నాధుడే లేడు. ఈ శేష జీవితం ఎలా గడపాలని ఆలోచనతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. కడుపున పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకున్నారు గాని కన్నతల్లి ఎలా బ్రతుకుతుందని ఆలోచన ఏ ఒక్కరికి లేదు. అమ్మ వెళ్లి వస్తాo అంటూ