అమ్మమ్మ గారి ఇల్లు

  • 441
  • 1
  • 120

అమ్మమ్మ గారి ఇల్లు" రేపటి నుంచి నా నా కాలేజీకి సెలవులు అoటు ఉత్సాహంగా "రేపు నేను అమ్మమ్మగారి ఊరు వెళ్ళిపోతున్న అoటు కొడుకు కిరణ్ చెబుతున్న మాటలకి నవ్వుతూ ఉండిపోయింది తల్లి సంధ్య. కాలేజీకి సెలవిస్తే ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండవు. అమ్మమ్మగారి ఊరు వెళ్ళిపోతాను అంటావు. అక్కడ ఏముందిరా ? నాకంటే నీకు అమ్మమ్మ ఎక్కువా !అని అడిగింది కొడుకుని సంధ్య.  అవును అమ్మమ్మ కావల్సినవన్నీ చేసిపెడుతుంది ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమగా మాట్లాడుతుంది. ఆప్యాయంగా దగ్గర తీసుకుంటుంది. ఆ ఇల్లు చూస్తే స్వర్గంలా ఉంటుంది అంటూ అమ్మమ్మ గురించి తాతయ్య గురించి కబుర్లన్నీ చెబుతూ ఆ రాత్రి నిద్రలోకి జారిపోయాడు కిరణ్. మర్నాడు ఉదయమే ఫస్ట్ బస్సుకి కిరణ్ ని రావులపాలెం దగ్గర ఉన్న వాడపల్లిలో ఉన్న అత్తగారింటికి పంపించాడు కిరణ్ తండ్రి రామారావు. సంధ్య తండ్రి పరంధామయ్య ఇంత వయసు వచ్చినా ఆ ఊర్లోనే ఉంటూ వ్యవసాయం