ఇంటి దొంగతెల్లారేసరకల్లా ఊరంతా గుప్పు మంది ఆ ఊరి ప్రెసిడెంట్ గారి ఇంట్లో దొంగతనం వార్త. అసలే ఊరు ప్రెసిడెంట్ ఊరు జనం అంతా పరామర్శించడానికి వచ్చి ఆ వార్తలు విని భయంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వేసవి కాలం కదా అప్పట్లో అందరూ వీధుల్లో మంచాలు వేసుకుని పడుకునేవారు. అంత భయాలు ఉండేవి కాదు అంతవరకు. ఆరోజు కూడా అలాగే వీధిలో చల్లగాలి కి నిద్ర పట్టేసి అర్ధరాత్రి బాత్ రూమ్ కి వెళ్ళవలసి వచ్చి లేచిన ప్రెసిడెంట్ రామరాజుకి గదిలో ఏదో శబ్దం అవుతున్నట్లు వినపడింది.లైట్ వేసేటప్పటి ఎవరో నలుగురు మనుషులు పెట్టె మోసుకుని పారిపోతున్నారు. గబగబా గదిలోకి వెళ్లి చూసేటప్పటికి ఉండవలసిన చోట కావిడి పెట్టి కనబడలేదు. కావిడ పెట్టి నిండా వెండి సామాన్లు . రామరాజు గారి అబ్బాయి పెళ్లికి వచ్చిన సామాన్లు రామరాజు గారు వైద్యం చేసేటప్పుడు పేషెంట్లు ఇచ్చే బహుమతులు పెద్ద కావిడి