కన్యాదానo

  • 528
  • 1
  • 153

కన్యాదానంఉదయం 10 గంటలు అయింది.పరంధామయ్య గారు అప్పుడే టిఫిన్ ముగించుకుని తీరికగా వాలు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. ఈనాడు పేపర్లో వచ్చే వరుడు కావలెను ప్రకటనలు చూస్తున్నాడు. ఇంతలో ఒక మూలగా కన్యాదాతలు కావలెను అని ప్రచురించిన ప్రకటన బాగా ఆకర్షించింది. పరంథా మయ్య గారు ఇదేమిటి చాలా విచిత్రంగా ఉంది అనుకుంటూ ప్రకటన పూర్తిగా చదివాడు.తల్లిదండ్రులు లేని పిల్లకి స్వచ్ఛందంగా కాళ్లు కడిగి కన్యాదానం చేయడానికి దాతలు కావలెను అంటూ మిగిలిన వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. భార్యకు ప్రకటన చూపించి వెంటనే ఆ పేపర్ లో ఇచ్చిన నెంబరుకి కాల్ చేసారు పరంధామయ్య గారు. హలో అంటూ అవతల నుంచి ఒక ఆడ గొంతు వినిపించింది. తనని తాను పరిచయం చేసుకుని ఎప్పటినుంచో ఇటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నామని తనకి ఇద్దరు మగ పిల్లలే అని పెద్దబ్బాయి కి మ్యారేజ్ చేశామని రెండో అబ్బాయికి సంబంధం