రక్తం రాత్రిఉదయం ఏడుగంటల సమయం...ఉత్తరప్రదేశ్‌లోని బడౌత్ పోలీస్‌స్టేషన్...ఇన్‌స్పెక్టర్ మనోహర్‌సింగ్ ఏదో పనిమీద ఆ సమయానికే స్టేషన్ చేరుకున్నాడు.ఆయన కుర్చీలో కూర్చోబోతుండగా ఓ వ్యక్తి హడావుడిగా స్టేషన్‌లో అడుగుపెట్టాడు.ఆయాసంతో రొప్పుతున్నాడు.బహుశా చాలాదూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి ఉండాలి లేదా పరుగు పరుగున వచ్చి ఉండాలి అని అనుకున్నాడు ఇన్‌స్పెక్టర్ మనోహర్‌సింగ్.ఇన్‌స్పెక్టర్ మనోహర్‌సింగ్ ఆ వ్యక్తి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.‘‘సార్ ఘోరం జరిగిపోయింది. ఎవరో మా అన్నను హత్యచేశారు’’ అని గద్గదస్వరంతో అన్నాడు.హత్య అనే మాట వినగానే ఇన్‌స్పెక్టర్ మనోహర్‌సింగ్ ఉలిక్కిపడ్డాడు.తను ఈ స్టేషన్‌లో డ్యూటీలో చేరినప్పటి నుంచి చాలావరకు నేరాలు అదుపుచేశాడు. అలాంటప్పుడు ఇప్పుడు ఏకంగా హత్య అంటే? ఇది తమ పోలీసులకే సవాల్‌గా అనిపిం చింది.ఇన్‌స్పెక్టర్ మనోహర్‌సింగ్ ఆ వ్యక్తిని కూర్చోబెట్టి గ్లాసు నీళ్ళు ఇచ్చాడు. ఆ వ్యక్తి నీళ్ళు తాగి కాస్త సేదతీరాక అతడి నుంచి హత్య ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? శత్రువులు ఎవరైనా ఉన్నారా? మొదలైన వివరాలు