అన్నపూర్ణమ్మ" చూడు కనకమ్మ రెండో పెళ్లి వాడని ఇంకేమీ ఆలోచించకు. కుర్రవాడు నాలుగు వేదాలు చదివిన పండితుడు. యజ్ఞాలు యాగాలు చేయించడంలో దిట్ట. వయసు గురించి ఆలోచించకు. ఆ ఊర్లో లంకంత కొంప సొంత వ్యవసాయం ఆవులు గేదెలు చెప్పాలంటే వాళ్లకు ఏమీ లోటు లేదు. మొదట మేనమామ కూతుర్నే చేసుకున్నాడు. ఆ అమ్మాయికి ఒక కూతురు పుట్టిన తర్వాత చనిపోయింది. కూతురుకి పెళ్లి చేసినప్పటికీ భర్త కూడా పోయాడుట. మేనమామకు ఒక్కతే కూతురు . మేనమామ అతని భార్య ,భర్త పోయిన కూతురు ఈ పెళ్ళికొడుకు దగ్గరే ఉంటారు. కాబట్టి నువ్వు ఏమీ ఆలోచించకు. మన అన్నపూర్ణమ్మ అన్ని విధాలా తగిన సంబంధం. తండ్రి లేనీ పిల్లలకి సంబంధాలు ఎలా వెతుకుతావ్. నేను నీ మంచి కోరే చెబుతున్నాను అంటూ గబగబా చెప్పేసి కనకమ్మ గారు ఇచ్చిన మంచినీళ్లు తాగేసి వెళ్ళిపోయాడు పెళ్లిళ్ల పేరయ్య నారాయణ శాస్త్రినారాయణ శాస్త్రి గారు