కనకయ్య తాతసాయంకాలం నాలుగు గంటలు అయింది. మండువేసవి కాలం.చల్లగాలి కోసం వీధిఅరుగు మీద కూర్చున్న కనకయ్య తాతకి గుమ్మo ముందు రిక్షా ఆగి అందులోంచి ఒక జంట దిగుతూ కనబడ్డారు. "రండి బావగారు ఏమ్మా సుమతి ఎలా ఉన్నావ్? ఇద్దరు లోపలికి రండి అంటూ హాల్లోకి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఇంతలో కనకయ్య తాత భార్య రవణమ్మ గ్లాస్ తో మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చింది. కుశల ప్రశ్నలు అయ్యాయి. ఇంతలో సుమతి బ్యాగ్ లో నుంచి శుభలేఖ తీసి " అన్నయ్య చిన్నమ్మాయికి కూడా పెళ్లి కుదిరింది. ఈ నెల 30వ తారీఖునపెళ్లి ముహూర్తం. నువ్వు మా పెద్ద పిల్ల పెళ్ళికి ఎంతగానో సహాయం చేసావు. నేను ఆ భోజనాలు సంగతి అసలు పట్టించుకోలేదు.గాడి పొయ్యి దగ్గరకి కూడా రాలేదు. అప్పుడు మగ పెళ్లి వారందరూ భోజనాలన్నీ చాలా చాలా బాగున్నాయి అంటూ ఎంతో ఆప్యాయంగా వడ్డించారు అంటూ ఇప్పటికీ చెప్తుంటారు.ఈ పెళ్లి కూడా నీ చేతుల మీదుగానే జరిపించు