హాయ్... ఏంటీ నిన్న టచ్‌లో లేవు... ఎటెళ్లావు?’’‘‘నా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేశా...’’‘‘అవునా... ఏం చేశారు...’’‘‘అబ్బా... ఆశ... అదేంటో గానీ అతడు ముద్దు పెట్టినా, ముట్టుకున్నా ఏదోలా ఉంటుంది...’’ఫేస్‌బుక్‌లో సాగుతున్న చాటింగ్ మున్నీని ఎగ్జయిట్ చేస్తోంది.రష్మీ తనను రెచ్చగొడుతోంది. ఫేస్‌బుక్‌లో కొన్ని సెక్సీ ఫోటోలు కూడా పెట్టింది.చాటింగ్ కొనసాగుతుండగానే ‘మున్నీ’ అంటూ తల్లి పిలవడంతో ‘బై.. సీ యూ...’’ అంటూ గబగబా టైప్ చేసి లాగౌట్ అయ్యింది.‘‘ఏమండీ... మున్నీ వారం రోజులుగా డల్‌గా ఉంటోంది. రెండు రోజుల నుంచీ కాలేజీకి కూడా వెళ్లడం లేదు...’’‘‘అదేంటి రాజేశ్వరీ... జ్వరంగానీ వచ్చిందా...’’‘‘ అస్తమానం ఫేస్‌బుక్, వాట్సాప్‌లో చాటింగ్ చేసే మున్నీ ఫోన్ రింగ్ వింటేనే ఉలిక్కిపడుతోంది...’’ఆఫీసుకు వెళ్లబోతున్న అనిల్ భార్య చెప్పిన విషయం విని వెంటనే మున్నీ బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. అతడి వెనకే వెళ్లింది రాజేశ్వరి.బెడ్ మీద మునగదీసుకుని పడుకున్న కూతురి పక్కనే కూర్చుని నుదుటిపై చేయి వేసి చూస్తూ ‘‘మున్నీ ఏమైందమ్మా...’’ లాలనగా