నాన్న నాకంటే ఎప్పుడు అదృష్టవంతుడే!ఉదయం 9.00 అయింది. ఆ ఊర్లో రమేష్ బస్సు దిగి సరాసరి ఇంటికి నడుచుకుంటూ వచ్చి గుమ్మoల్లోకి అడుగు పెట్టేసరికి అరుగు మీద రమేష్ తండ్రి చలపతిరావు వాలుకుర్చీలో పడుకుని పక్కనే కూర్చున్న ఊరి వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా నవ్వుకుంటున్నారు. " నాన్న ఎలా ఉన్నారని పలకరించే సరికి మీ నాన్నగారికి ఏవండీ చాలా మంచి వ్యక్తి ఉన్న రోజు ఒకలాగే ఉన్నాడు లేని రోజు ఒకలాగే ఉన్నాడు అందరూ కావాలనుకునే వ్యక్తి. అందరి క్షేమం కోరే వ్యక్తి అంటూ అక్కడ కూర్చున్న జనం అంటుంటే ఒక్కసారి గర్వంగా అనిపించింది రమేష్ కి " నువ్వేమిటిరా అలా చిక్కిపోయావ్ ! ఆఫీసులో అంతా బాగానే ఉందా! పిల్లలు కోడలు అంతా క్షేమమేనా అంటూ ప్రశ్నలు కురిపించే నాన్నకు సమాధానం చెప్పి ఎదురుపడిన అమ్మ సీతమ్మని పలకరించి ఇంటి లోపలికి అడుగు పెట్టాడు రమేష్.రమేషు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా హైదరాబాదులో