నా కంటే ముందుగా

  • 669
  • 198

నాకంటే ముందుగా!సాయంకాలం నాలుగు గంటలు అయింది. కాకినాడ నగరంలోని జన్మభూమి పార్క్ సందర్శకులతో హడావిడిగా ఉంది.ఒక మూలగా ఉన్న బెంచి మీద వయసు మళ్లి న భార్య భర్త కూర్చుని ఏదో సుదీర్ఘంగా చర్చించుకుంటున్నారు. చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. ఆ వయసులో పార్కుకి కొచ్చి కూర్చునిఅంత ప్రేమగా కబుర్లు చెప్పుకోవడం నిజంగా ఒక అదృష్టం అనిపిస్తుంది. నాకే కాదు ఎవరికైనా అదే మాట అనిపిస్తుంది. సుదీర్ఘమైన దాంపత్య జీవితం. సహకరించే ఆరోగ్యం చూసేవాళ్ళందరికీ ముచ్చటేస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడకునే వాళ్లు ఈరోజు ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు.  ఆయన పేరు రామారావు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. రామారావు గారి భార్య పేరు సీతమ్మ. ఇద్దరు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలకి చదువులు చెప్పించి పెళ్లిళ్లు చేసి బాధ్యతలు అన్నీ తీరిపోయి ఆ భార్యాభర్త ఇద్దరూ తన సొంత ఇంట్లో హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. రామారావు గారు మహా ఘటికుడు. సీతమ్మ