నరసయ్య కథ. " నీ కొడుకు నరసయ్య అంతా వాళ్ళ నాన్న పోలిక. ఆ ఒడ్డు ఆ పొడుగు అంతా మీ ఆయన పోలికే అంటూ కొడుకు గురించి ఊరి ప్రజలు చెప్తుంటే ఉప్పొంగి పోయేది కావమ్మ. వాడు చేసే అల్లరి గురించి రోజు ఫిర్యాదులు వస్తుంటే తండ్రి లేని బిడ్డ కదా! సరిగా పెంచలేకపోతున్నానేమో అని రోజు మనసులో బాధపడేది నర్సయ్య గురించి. వీడికా చదువు సరిగా రాలేదు. వెనక చూస్తే ఆస్తిపాస్తులు లేవు. వీడి బ్రతుకు ఎలాగ ? అని బాధపడుతూ ఉండేది కొడుకు గురించి కావమ్మ.ప్రతి ఊర్లో కొంతమంది మంచి మంచి సలహాదారులు ఉంటారు. ఆ ఊర్లోని యువకులకి మంచి మంచి సలహాలిస్తూ వాళ్లని మంచి దారిలో పెట్టడం ఆయనకు హాబీ. అలా అచ్యుతరామయ్య కాళ్లు పట్టుకుంది తన కొడుకు గురించి కావమ్మ. ప్రతి వాళ్లు సలహాలిస్తుంటారు కానీ అవి అమలు చేయడానికి సహాయం చేయరు కానీ