“సంతోషంగా గడపాల్సిన సమయంలో ఏదేదో ఆలోచించి మనసు పాడుచేసుకోకు. కమాన్ మంచి కాఫీ తాగుదాం”. ఆమె భుజం చుట్టూ చేయివేసి అతను నడిపిస్తుంటే ఆమెలోని సంశయాలు అతని మాటల వెల్లువలో కొట్టుకుపోయాయి. నిర్ణయం "ఈ పెళ్లి ఒక ఇంద్రజాలమో, మహేంద్ర జాలమో నాకు తెలియదు లలితా.! కొన్నాళ్లక్రితం వరకు నువ్వెవరో తెలియదు. కానీ నిన్నుచూసాక నిన్నే పెళ్లాడాలననిపించింది. మా వాళ్ళు, మీ వాళ్ళు ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకుంటావో లేదో అని పెద్ద అనుమానం." "ఎందుకలా అనుమానపడ్డారు..?" "ఏముంది ఇవ్వాళా అమ్మాయిలందరికీ ఎమ్బీబీయస్సో, బీ టెక్ చేసిన అబ్బాయ్యో మాత్రమే కావాలి. వాడు ఫారిన్ కి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి నేను మామలు పోస్ట్ గ్రాడ్యుయేట్ ని మామూలు అకౌంటెంట్