డబ్బులు రాని ఉద్యోగం.

  • 426
  • 1
  • 105

ఆరోజు పేపర్లో ఓ ప్రకటన వచ్చింది... పెద్ద పెద్ద అక్షరాలతో “డబ్బులు రాని ఉద్యోగం” అని హెడ్డింగు... దాని కింద... మంచి ఉద్యోగం ఉంది... కాని డబ్బులు రావు.. ఆసక్తి కలవారు సంప్రదించవలసిన చిరునామా ఫలానా... ఇదీ ఆ ప్రకటనలో సారాంశం...వచ్చే డబ్బులే చాలడం లేని ఈ రోజుల్లో డబ్బులు రాని ఉద్యోగానికి ఎవరు వెళతారులే... అనుకుంటే పొరపాటే.ఎందుకంటే... ఆ ఉద్యోగం కోసం పోటీపడి మరీ వచ్చారు... అసలే చిన్న ఆఫీసు... అంత చిన్న ఆఫీసులో ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థులు నిండిపోవడంతో గాలాడక ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడింది... ఆ గది నిండిపోవడంతో పాటు.... ప్రకటన వచ్చిన పత్రికని చంకలో పెట్టుకుని పరుగు పరుగున వస్తున్న అభ్యర్థులని చూడగానే ప్యూను గుండె గుభేల్ మంది.ఇలా కాదనుకుని వెంటనే ఆ గదిలో ఉన్న అభ్యర్దులందరినీ వరుస క్రమంలో నిలబెట్టే పనిలో చెమటలు కార్చేస్తున్నాడు... అలా వరుస క్రమంలో అనగా.. క్యూ పద్ధతిలో అభ్యర్దులని నిలబెడ్తే... ఆ క్యూ కాస్తా