పట్టణంలో పల్లెటూరు

  • 2.6k
  • 1
  • 1k

 ఒకరోజు  పేపర్లో, కొత్తగా కట్టిన గేటెడ్ కమ్యూనిటీ గురించి ఒక ప్రకటన వచ్చింది.వివరాలు ఆసక్తిగా కనిపించేసరికి, పూర్తిగా చదవడం మొదలుపెట్టాము. చాలా వరకు ఫ్లాట్ బుకింగ్స్ జరగడంతో, అక్కడ ఉన్నవాళ్ళు కొందరు వాళ్ళ అనుభవాలు కూడా ఆ ప్రకటనలో వ్యక్తపరిచారు.ఆ ప్రకటన మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది. బడ్జెట్ మాకు అనుకూలంగా ఉండటంతో, ఒకసారి చూసి వద్దాము అనుకున్నాము.పట్టణంలో ఎక్కువ మంది గేటెడ్ కమ్యూనిటీలో ఉండటానికే ఇష్టపడతారు. ఎందుకంటే, ఇక్కడ ఉండే ట్రాఫిక్ సమస్య వల్ల, ప్రతీ పనికి ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.అందుకని, అన్ని వసతులూ, ఒకే దగ్గర ఉండే గేటెడ్ కమ్యూనిటీ అయితే సౌకర్యంగా ఉంటుందన్న ఆలోచనతో బయలుదేరాము.ఓ గంట ప్రయాణం చేసి, అక్కడికి చేరుకున్నాము.కారు దిగగానే మాతో ఫోన్లో సంభాషించిన మేనేజర్  ఎదురు పడ్డారు.లోపలకి వెళ్ళే ముందు మా కారుని పార్క్ చేయమని, బయట ఉన్న ఒక అపార్టుమెంట్ ని చూపించారు.కార్లు, క్యాబ్