ఆత్మ పగ ప్రతీకారం దెయ్యం హార్రర్ రాత్రి ఒంటగంట అయింది.....మల్లికకు సడెన్ గా మెలుకువ వచ్చింది...ఎవరో అటుగా వెళ్తున్నట్టు అనిపించింది...కిటికీ ముందు ఉన్న కర్టెన్ నుంచి ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నారు అనే విషయం మల్లిక గమనించింది..దుప్పట ముసుగు వేసుకొని తలగడ తన రెండు చేతులతో గట్టిగా పట్టుకొని కళ్ళు రెండు మూసుకొని పడుకుంది..డోర్ తెరుచుకుంటున్న శబ్ధం వినిపించింది..అప్పుడు వరకు డబై రెండు కొట్టుకుంటున్న గుండె వేగం కాస్త వందకు చేరింది...నోటిలో హనుమాన్ చాలీసా చదువుకుంటూ....దెయ్యం కాదు దెయ్యం కాదు అని మనసులో అనుకుంటుంది మల్లిక....ఈలోగా దుప్పటి ఎవరో కిందకి లాగుతునట్టు అనిపించి...ఒక చేతితో పిల్లో పట్టుకొని మరొక చేతితో దుప్పటిని గట్టిగా పట్టుకుంది..లాగుతున్న వేగం పెరిగింది...ఎవరో దుప్పటి లాగేసారు..మల్లిక ఎవరో కూడా చూడకుండా కళ్ళు మూసుకునే తన పిల్లో తీసుకోని ఎదురుగా ఉన్న వ్యక్తిని టపా టపా టపా కొట్టసాగింది...ఆగు మల్లి ఆగర నేను అన్నయను....హ్యాపీ బర్తడే.....చెప్పడానికి వచ్చాను.....అన్నయ నువ్వా?????థాంక్స్.....దెయ్యం అంటే ఇంత భయం ఉన్నప్పుడు ఎందుకు నీకు