జగమంత కుటుంబం నాది !

  • 303
  • 1
  • 96

(కధ) మోసం నమ్మకం అపరాధం ''పిల్లలూ. మనింటికి ఎవరొచ్చారో చూడండి.!" ఆ ఇంటి మండువా లోగిలిలోకి అడుగుపెడుతూ చైతన్య అన్న మాటలకి ముద్దబంతుల్లాంటి ఇద్దరమ్మాయిలు''డాడీ'' ఆంట్ పరుగెత్తుకు వచ్చి తండ్రిని కౌగలించుకోబోతూ వెనుక 'నన్ను' చూసి మరింతగా అతుక్కుపోయారు వాళ్ళ నాన్నని.''ఎవరు డాడీ?'' పెద్ద పాప కాబోలు అడిగింది. ''మనింటికి ఎవరిని తీసుకొస్తానని చెప్పాను?'' చైతన్య కొంటెగా అడిగాడు.''తా...తాతయ్య... తాతయ్యేనా?'' అంది సంభ్రమాశ్చర్యాలతో.''అవునమ్మా. నేనే..తాతయ్యను. మిమ్మల్ని చూడాలి వచ్చానమ్మా." అన్నాను అక్కడే ఉన్న చెక్క కుర్చీలో కూర్చుంటూ.చూపిన పొడుగు దగ్గరకు చెంగు చెంగున గెంతి వస్తున్న ఆవుదూడల్లా ఇద్దరు పిల్లలూ నా దగ్గరకు వచ్చి కరుచుకుపోయారు. ''తాతయ్యా. ''అంటూ వారి ఆత్మీయతతో అనుభూతి లయమై- నా ఒళ్ళు ఝల్లుమంది. ఎంతకాలమైంది ఏ పిలుపు విని...ఆర్ద్రతతో నాకు తెలియకుండానే నా కళ్ళు చెమర్చాయి.రెండు నిముషాలు వారిద్దరినీ చెరొకపక్క హృదయానికి హత్తుకుని అవ్యక్తానందం అనుభవించాను. ..కోటానుకోట్ల క్షణాల తర్వాత. అంతలో నా భుజం మీద చెయ్యి పడిన స్పర్శ కు తలెత్తాను. ఎదురుగా