“మీ నాన్న పోయి ఆరు నెలలు కూడా కాలేదు, వున్న భూమి అమ్ముకుని దేశాలు పోతానంటే ఎలాగరా నాయనా. మనకు ఆధారం ఉండొద్దు.”“అది కాదమ్మా, అమెరికా చదువంటే మాటలా బోలెడు డబ్బు ఖర్చవుతుంది.”“మనకెందుకొచ్చిన అమెరికా చదువులు రా, వున్నచోటే హాయిగా వుండక, ఎలాగు మీ నాన్న సంపాదించిన మూడెకరాలు, మా పుట్టింటి వాళ్లిచ్చిన రెండెకరాలు ఉండనే వుంది. అది చాలదూ మనం బ్రతకడానికి. ఇక్కడే వుండి నీ చదువుకు తగ్గ ఉద్యోగం వెతుక్కోరా.”“అమెరికా వెళితే ఇక్కడి కన్నా మంచి ఉద్యోగం, బాగా డబ్బులు సంపాదించొచ్చమ్మా. ఆ తరువాత మనం దర్జాగా బతకొచ్చు.”“చూడయ్యా.. వున్నది ఒక్కగానొక్క కొడుకువి, అదీ లేక లేక పుట్టిన బిడ్డవి, నన్ను ఒంటరిదాన్ని చేసి నువ్వు దేశాలు అంటూ పోతే నా పరిస్థితి ఏంటి చెప్పు. మాట్లాడవేం అన్నయ్యా..”“నువ్వలా కన్నీళ్లు పెట్టుకోకమ్మాయ్, చూడు అల్లుడూ, మీ అమ్మ చెప్పేది కూడా కాస్త ఆలోచించు, వున్నది ఒక్కడివి, నిన్నెంతో ప్రేమతో