అనిరుధ్ చిరుద్యోగి.. అతను వాసంతితో ప్రేమలో పడతాడు.. ఇద్దరు చాలా గాఢంగా ప్రేమించుకుంటారు.. అనిరుధ్ తనకున్నంతలో చాలా బహుమతులు కూడా ఇస్తుంటాడు.. ఒకరోజు వాసంతి అనిరుధ్ తో రేపటి నుండి నన్నుచూడడం వీలవదు నేను అమెరికాకు వెళ్తున్నాను బై .. ఫోన్ చేసి చెప్పి స్విచ్ ఆఫ్ చేసేస్తుంది.. అప్పటి నుండి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ పనిచేయదు..అనిరుధ్ చాలా రోజులు బాధపడి తను కేవలం చిన్న ఉద్యోగి కాబట్టి వాసంతి తనను అలా వదిలేసిందని భావించి చాలా కష్టపడి కొన్ని సంవత్సరాలలో తనదైన వ్యాపారాన్ని ప్రారంభించి మంచి స్థితికి ఎదుగుతాడు..ఇప్పుడు తనకు ఇల్లు, కారు, మంచి బ్యాంకు బ్యాలన్సు వస్తుంది..ఈ సమయంలో తన ప్రేమను మరొక్కసారి చెబుదామని అనిరుధ్ మరల తన ఊరికి ప్రయాణమవుతాడు.. ఊరికి తన స్వంత కారులోనే వస్తాడు..ఊరి ప్రారంభంలో ఒక జంట అతనికి తారసపడతారు..చాలా దూరంనుండే అనిరుధ్ గుర్తు పడతాడు వారు వాసంతి అమ్మనాన్నలని.. వారు