ఆనంద్, డాక్టర్ విమలలది చాలా ఆనందమైన కుటుంబం. ఆనంద్ ఓ పెద్ద కంపెనీకి డైరెక్టర్. డాక్టర్ విమల పేరుమోసిన గైనకాలజిస్ట్. వాళ్ళకి ఒక్కడే బాబు - పదేళ్ళ విజయ్. ఆనంద్ వాళ్ళ నాన్నగారు ప్రకాశరావుగారు ఆ ఇంటికి పెద్ద. క్షణం తీరిక లేకుండా కర్తవ్య నిర్వహణలో ఎంతో బాధ్యతాయుతంగా వుంటూ ఎంతో కష్టపడే కొడుకూ - కోడల్నీ చూస్తూ తనకంటూ సమయం మిగుల్చుకోలేకపోతున్నారని ఎప్పుడూ బాధపడతారు ప్రకాశరావుగారు. తన కోసం అమ్మానాన్నా టైం ఇవ్వట్లేదని బాధపడేవాడు విజయ్ ఆర్నెల్ల క్రితం వరకూ. ఇప్పుడు అతని లోకమే వేరు.***“ప్రకాశరావుగార్ని బలంగా తల మీద మోది చంపేశారు ఎవరో...”నెత్తుటి మడుగులో వున్న ఆయన తలను మెల్లగా ఎత్తి తన తొడమీద పెట్టుకున్నాడు ఆనంద్. తనని పువ్వుల్లో పెట్టి పెంచిన నాన్న చివరి ప్రయాణం రోజారేకుల మీద సాగాలి అనుకున్నాడు కానీ ఇలా నెత్తుటి వరదలో కాదు. గుండెలో ఎంతో ఉద్వేగం. ఆయన చిరునవ్వూ, శాంతం