ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లడం కోసం బస్సెక్కాడు వివేక్.ఒక ప్రైవేట్ స్కూల్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా చేస్తున్నాడు.కేజీ నుంచి పీజీ వరకు ఉన్న ఆ స్కూలేజీ లో మంచి జీతమే వస్తుంది అతనికి.ఈ మధ్యే వివేక్కి పెళ్లి అయింది.భార్య మమత.పేరులో నింపుకున్న మమత,ఒక సంవత్సరానికి సరిపోయింది.మమత కూడా మిడిల్ క్లాస్ అమ్మాయే.జీవితం మీద బోలెడన్ని ఆశలతో వచ్చానని మొదట్లో చెప్పినపుడు,వివేక్ సంతోషపడ్డాడు.నాకు అన్నింటిలోనూ తోడుగా ఉంటుంది అనుకున్నాడు.ఏమండీ!అంటూ పొద్దున కాఫీ కప్పుతో మరియు నవ్వుతో ప్రత్యక్షమై...మీకిష్టమైన టిఫిన్ చేసెను,కుంకుడు రసంతో తలంటుకొండి,షాంపూ వద్దు..తలస్నానం చేసి సరిగ్గా తుడుచుకోరేమిటీ!?ఇంక చాకలి వద్దు,బట్టలు నేనే ఉతికి ,ఇస్త్రీ చేస్తాను.ఇలా ..వివేక్ జీవితపు ఒడ్డును సంతోషపు కెరటాలులా తాకుతూ...మురిపించేది..నా అంత అదృష్టవంతుడు భూమి మీద లేడని,ఓ నిర్ణయానికి వచ్చేసేడు.ఈ సంతోషంలో ఓ పాపకి జన్మనిచ్చింది మమత..కూతురుని మాధురి అని పిలుచుకున్నాడు వివేక్..మనవరాలు అయినా కుతురిలా పెంచుతున్నారు వివేక్ తల్లిదండ్రులు.మమతకు పొద్దంతా ఇంటిపని,వివేక్ వచ్చాక కూర్చుని