పొద్దు వాలుతోంది ...అరుణుడు సూర్యదేవుణ్ణి మానవ లోకం నుంచి తీసుకు పోవడం ప్రారంభించాడు ...ఆకాశం అంతా దట్టంగా ఉన్ననారింజ పండు అలికినట్టుంది...సగం కరిగిపోయిన చంద్రుడు ఒక మూలగా బిక్కు బిక్కు మంటూ చూస్తూ పైకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు...అక్కడక్కడా మబ్బు తునకలు కాఫీలో తొరకల్లా తెలియాడుతున్నాయి...కోవిడ్ భయంతో జన సంచారం ఎలాగైనా పలచగానే ఉంది...సాయంత్రమయ్యేసరికి అది మరింత పలచబడింది...అప్పుడప్పుడు చప్పుడు చేసుకుంటూ వెళ్లే కొద్దిపాటి వాహనాలు మాత్రమే కనిపిస్తున్నాయి...రోడ్డు పక్కన పళ్ళు, కూరలు అమ్ముకునే దుకాణాలవాళ్ళు, గుడి దగ్గర పువ్వులు అరటిపళ్ళు అమ్మే వాళ్ళు మెల్లిగా సద్దుకుని ఆ రోజుకి ఇంటికి బయలుదేరుతున్నారు రోజంతా భయం భయంగా తమ పనులు చేసుకుంటున్న మనుషులు మెల్లిగా ఈ కొత్త జీవన విధానానికి అలవాటు పడుతున్నారు… కొంతమంది కళాపోషకులమనుకునే వాళ్ళు ఆ నారింజ సూన్యంలోకి చూస్తూ దిగులు పడుతున్నారు...కొందరు రొమాంటిక్ గా ఫీల్ అవుతూ "ఖోయా ఖోయా చాంద్" లాంటి హిందీ పాటలో "సడిసేయకో గాలి" “మధురమధురమీ” లాంటి అద్భుత