నిండు పున్నమి రాత్రి... ఈ లక్డౌన్లూ, ఇంట్లోంచి పనిచేసే పద్ధతులూ ఒకరకంగా మంచివే అయినా పని మాత్రం చాలా పెరిగిపోయింది అనుకుంటూ అప్పడికి చాలా గంటలుగా తాను చేస్తున్న పని ఆపి వెనక్కి వాలాడు రాజారామ్...ఉద్యోగం ఇచ్చిన ఒత్తిడి నుంచి బయట పడేందుకు ప్రయత్నం చేస్తూ ఫోన్లో మృదువుగా మోగుతున్న తలత్ పాటలు వింటూ, కిటికీ లోంచి బయటకు చూసాడు... ఎల్ పి రికార్డ్స్ నుంచి రేడియో దాకా , కాసెట్ల నుంచి సీడీ ల దాకా, ఇప్పటి డిజిటల్ సంగీతం దాకా టెక్నాలజీ లో ఎన్నో మార్పులు వచ్చినా, మన రాగద్వేషాలలో మార్పులేమీ లేవు, తలత్ గొంతులో అదే మాధుర్యం మన మనస్సులో అదే వణుకు...నవ్వుకున్నాడు రాజారామ్ మెల్లిగా మధ్యరాత్రవుతోందేమో చుట్టూ ఉన్న ప్రపంచం సద్దుమణుగుతోంది...అప్పుడప్పుడు దూరం నుంచి వినిపించే కుక్కల అరుపులు, మధ్య మధ్య దూరంగా రోడ్డు మీద పోతున్న వాహనాల రొదా మించి అంతా నిశ్శబ్దం...అకస్మాత్తుగా దూరం నుంచి