కుటుంబం

  • 744
  • 1
  • 219

ఓ ఊరిలో ఆ రోజు పెద్ద వాన శాంతం పురుటి నొప్పులతో బాధ పడుతుంది. పెళ్లయ్యిన సంవత్సరం తిరగకుండానే బిడ్డకు తల్లయ్యింది. భర్త ఏదో ఒక ప్రయివేట్ కాంపెనీలో గుమస్తా పని చేస్తున్నాడు. శాంతం తల్లితండ్రులకు ముగ్గురు పిల్లలు.శాంతం పెద్ద కూతురు తన తరవాత ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనే ఒకే కారణం చూపి ఆ అమ్మాయిని ఒక మధ్య తరగతి కుటుంబం తో సంబంధం కలుపుకున్నారు. రెండో అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుని సుఖంగా కాపురం చేసుకుంటుంది. ఆఖరి పిల్లను కూడా ఇలానే బాధ్యత అంటూ పెళ్లి చేసేద్దాం అనుకున్న సమయానికి శాంతం పుట్టింటికి రావటం తో పెళ్లి వ్యాపకాన్ని మనుకున్నాడు తండ్రి.శాంతం కి ఓ కొడుకు పుట్టిన ఆరు నెలల్లో వాళ్ల మావగారు చనిపోయారు. అంతే కష్టాలు ప్రారంభం అయ్యాయి పాపం కొడుకు పుట్టిన వెంటనే తన భర్త ను మింగేసాడని అత్తగారు ఆ కుర్రవాడిని కనీసం ఎత్తుకోదు