కథలో రాకుమారుడు

  • 639
  • 204

ఆ గదిలో రెండు ఎ.టి.ఎమ్. మిషన్లు ఎదురుబొదురుగా ఉన్నాయి. రెండవదాని వద్ద ఉన్న వ్యక్తి డబ్బులు తీసుకుని వెనుదిరిగాడు. నిస్సహాయంగా నిలుచున్న పత్రలేక కనిపించింది. ఆమెను గుర్తుపట్టి, “హలో! ప్రముఖ చిత్రకారిణి పత్రలేక గారే కదూ?” అంటూ నవ్వుతూ పలుకరించాడు. విస్తుపోయి చూసిందామె. ఆ యువకుణ్ణి ఎక్కడో చూసినట్టే అనిపిస్తోంది.సిటీలో మూడు రోజులుగా ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. లబ్ధప్రతిష్ఠులతోపాటు వర్ధమాన చిత్రకారులు కూడా అందులో పాల్గొనడం విశేషం… ఆఖరు రోజున చిత్రకారులకు సన్మాన కార్యక్రమం జరిగింది. న్యాయనిర్ణేతలు ఏకగ్రీవంగా ఎంపికచేసిన ‘ప్రకృతికాంత’ చిత్రానికి అవార్డ్ లభించింది. తన తొలి ప్రదర్శనే అవార్డ్ ని తెచ్చిపెట్టినందుకు  చిత్రకారిణి పత్రలేక మది ఆనందంతో నిండిపోయింది. సభికుల కరతాళధ్వనుల నడుమ, సభాధ్యక్షుడు ఆమెను శాలువాతో సన్మానించాడు. లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేయబడ్డాయి ఆమెకు.సభానంతరం విలేఖర్లు పత్రలేకను చుట్టుముట్టారు. ఆమెను అభినందిస్తూ, వివిధ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరిచేసారు. అన్నిటికీ చిరునవ్వుతో జవాబులు ఇచ్చిందామె. పత్రలేక కారు ఎక్కుతూంటే