తొలి అడుగు

  • 135
  • 1
  • 51

స్వప్న, సంధ్య... ఇద్దరు మంచి స్నేహితులు... ఇరుగు పొరుగు వారవడం వల్ల.. వాళ్ళ స్నేహం పసివయసు నుంచే మొదలై వారితో పాటే పెరిగి పెద్దయ్యింది. ఒకే కాలేజి లో చదువు పూర్తి చేశారు.స్వప్న ఒక ప్రైవేట్ ఫర్మ్ లో ఉద్యోగం చేస్తోంది..ఇంట్లో ఉండి ఇంటి పని అంటూ మనల్ని మనం పనిమనుషులుగా మార్చుకోవడం అంతా నాన్సెన్స్ అనేది స్వప్న అభిప్రాయం. అందరూ ఉద్యోగాలు చేస్తే కుటుంబ వ్యవస్థ ను సవ్యంగా నడిపేదెవరు... పైగా అవసరం లేకపోయినా స్త్రీ ఉద్యోగం చేస్తే నిజంగా ఉద్యోగం అవసరం ఉన్నవాళ్లు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అనేది సంధ్య ఆలోచన. "నీవన్నీ పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు" అని సంధ్య ను ఎద్దేవా చేస్తుంది స్వప్న.. "పాత చింతకాయ పచ్చడే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెబుతోంది " అంటూ రిటార్ట్ ఇస్తుంది సంధ్య. వీరిద్దరి అభిప్రాయాలూ వారి వారి కోణాల లో నిజమే అయినా వారిద్దరి వాదనలలో తల దూర్చి తల బొప్పి కట్టించుకోవటం