2041 వ సంవత్సరం....తెల్లవారుజామున 4 గంటల సమయం.శుభోదయాన్ని సూచిస్తూ మోగిన ఫోన్ శబ్దం విని ఉలిక్కిపడి లేచాడు కృష్ణ మోహన్.ఫోన్ రిసీవర్ అందుకున్నాడు బద్ధకంగా.వార్త వింటూనే హతాశుడై మంచం దిగుదామని నేలమీద కాళ్ళు పెట్టేసరికి నేలనంతటినీ తడుపుతూ సన్నని నీటిపొర.గబగబా భార్య ప్రియంవదను,తల్లిని,పిల్లలిద్దరినీ లేపాడు."ప్రియా!ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అపుడే గంట నుంచి ట్రై చేస్తున్నారట.గోదారి ఊళ్ళో ప్రవేశించిందట. నిన్న రాత్రి వరకు ఎటువంటి సూచన లేదు.ఎక్కడా వాన కురిసిన దాఖలాలు లేవు. అటు రాజమండ్రి, ఇటు కొవ్వూరు గట్లు దాటి ఊళ్ళోకి ప్రవహిస్తోందట. నేను వెళ్తాను.వీలైతే అటెండర్ ని పంపిస్తాను .లేకుంటే ఇంటికి తాళం వేసి పక్కింటివారి సాయంతో ఎత్తైన ప్రదేశానికి చేరుకోండి. ఊ... క్విక్.."అతని మాట పూర్తి కాకుండానే వాకిట్లో జీప్ హారన్ వినిపించింది."వస్తాను ప్రియా.మీరంతా జాగ్రత్త."అతను కదలబోయాడు."డాడీ..." అంటూ పిల్లలు అతన్ని కరుచుకుపోయారు."మరేం భయం లేదమ్మా...ఇదేమీ వరదప్రభావం కాదు.మీరేం భయపడవద్దు.ఏం జరగదు.మీరు ధైర్యంగా ఉండి అమ్మకి, బామ్మకి