అనుబంధం

  • 339
  • 120

‘ప్రేమించుకున్న వాళ్ళు కలిసుండటానికి పెళ్లి అవసరమేమో కానీ పెళ్ళైన వాళ్ళు కలిసుండటానికి ప్రేమ అవసరం లేదు’ అని చెప్పడానికా అన్నట్టు ఇరవై ఏళ్ళ క్రితం ఇత్తడి లెటర్స్‌తో చేసిన ‘ఇందిరా చక్రపాణి’ నేమ్‌ ప్లేట్‌ కిలుం పట్టి మెరవకపోవడంతో, విసుగొచ్చిన సూర్యుడు తన తొలికిరణాల్ని నెమ్మదిగా పక్కింటికి మరల్చాడు.క్రమశిక్షణ గల కార్మికుడిలా అలారం తన పని తాను చేసింది. రెండో కాన్పు అవగానే విడిపోయిన రెండు సింగల్‌ కాట్‌లలో ఒకదానిమీంచి లేచిన ఇందిర నేరుగా వంటింట్లోకి నడిచింది.‘‘అలారాలు, కుక్కర్‌ విజిల్స్‌, నీకు సంబంధించిన రాగాలు’’ అన్నట్టు చక్రపాణి రెండో సింగల్‌ కాట్‌ మీద కాసేపు విసుగ్గా దొర్లి, పడుకునే ఫోన్‌ చూసుకున్నాడు. ఆమె కాఫీ పెట్టిచ్చింది. అతడు పేపర్‌ చదివాడు. ఆమె స్టవ్‌ మీద ఇడ్లీ పెట్టింది. అతడు వాకింగ్‌కి వెళ్ళొచ్చాడు. ఆమె కుక్కర్‌ పెట్టింది. అతడు స్నానం చేసొచ్చి పొట్టమీద పౌడర్‌, షర్ట్‌ మీద సెంట్‌ పూసుకున్నాడు. ఆమె టిఫిను,