ఈర్ష్య ద్వేషం

సాయంత్రం నాలుగు గంటల సమయం...మీరట్‌ పట్టణం నుంచి దూరంగా విసిరి వేసినట్టుండే కాజీసరాయ్‌ ప్రాంతం.వీధిలో జనసంచారం తక్కువగా ఉంది.పోలీస్‌ జీపు వేగంగా వచ్చి అక్కడ ఆగింది.జీపులో వచ్చిన పోలీసులు హుటాహుటిన జీపు దిగారు. ఇన్‌స్పెక్టర్‌ జాదవ్ జీపు నుంచి కిందికి దిగి చుట్టుపక్కలంతా దృష్టి సారించాడు.ఊరి నుంచి దూరంగా ఉన్న ఆ ప్రాంతంలో ఓ వేపచెట్టు.ఆ చెట్టు కింద ఓ గుడిసె.సరిగ్గా ఆ గుడిసె ముందు కొందరు గుమిగూడి ఉన్నారు.పోలీస్‌ జీపు ఆగటం చూసిన జనం భయంతో పక్కకు తప్పుకున్నారు.ఇన్‌స్పెక్టర్‌ జాదవ్‌ తన సిబ్బందితో ఆ గుడిసెను సమీపించాడు.చూపరుల గుండెల్ని జలదరింపచేసేలా పాతికేళ్ళ యువతి శవం రక్తపు మడుగులో వెల్లకిలా పడి ఉంది. ఆమె వొంటి మీది దుస్తులు అస్తవ్యస్తంగా చెదిరిపోయి ఉన్నాయి. ఆమె మెడ మీద, వక్ష స్థలంలోను, పొట్టమీద కత్తిపోట్ల తాలూకు గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ గాయాల నుండి స్రవించిన రక్తంతో ఆమె శరీరమంతా దాదాపు రక్తమయంగా