ఛాలెంజ్ 18

  • 246
  • 72

జీవితం అంటే ఒక సమస్య నుంచి ఇంకో సమస్యకి ప్రయాణం.----------------డిసెంబర్‌ నెలచలిచలిగా వుంది.రాత్రి పన్నెండు గంటలు దాటింది. లూనా మీద ఎవరో స్పీడుగా వస్తూ రోడ్డువారగా పడుకున్న కుక్కపిల్లను చూసుకోలేదు. ముడుచుకుని పడుకుందేమో, నిద్ర మత్తులో వుందేమో కుక్కపిల్లకీ ఆ అలికిడికి మెలకువ రాలేదు. దాంతో కుక్కపిల్ల కాలిమీదుగా లూనా పోవడంతో ఒక్కసారిగా బాధగా కుయ్యి మందది. దానరుపుని పట్టించుకోలేదు లూనా మీదున్న వ్యక్తి. తన ధ్యాసలో తానుండి వెళ్లిపోయాడు. అలావెళ్లిపోయిన వ్యక్తిని గుర్రుగా ఓసారి చూసి ‘మళ్లీ ఇట్రారా నీ సంగతి చెప్తాను’ అన్నట్లుగా తల విదిల్చి నొప్పి పెడుతున్న కాలిని మడిచి కుయ్యి కుయ్యి మంటూ ముందుకి ఎలక్ర్టికల్‌ పోల్‌ దగ్గరగా కుంటుకుంటూ వచ్చి, పోల్‌నానుకుని ముడుచుకుని మళ్లీ పడుకుంది కుక్కపిల్ల. లూనా రెండు మూడు మలుపులు తిరిగి శ్రీ సాయి కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్స్‌ దాటి కన్యకా పరమేశ్వరి కోవెల దాటి రథం వీధి దాటి