అయ్యా....!ఆ..ఏంటి రంగయ్య......?అయ్యా...పెళ్ళివారు బయలుదేరారంటయ్య.... రఘుపతిబాబు కబురెట్టారు.రంగయ్య మాట విన్న క్షణం నుండి...శంకరం ఉక్కిరిబిక్కిరి అవుతూ.. కబురు వచ్చేసింది....వాళ్లు వచ్చేస్తున్నారు .....అయ్యోయ్యో....ఇంకా ఎంతసేపు....త్వరగా..తెవలండర్రా..ఇంకా ఎంతసేపు...ఏమేవ్ కాంతం...అమ్మాయిని త్వరగా రెడీ చేయి ...ఆ..అన్నట్లు పిండి వంటలు చెయ్యడం ఎంతవరకు వచ్చింది..?ఒరేయ్ రంగ... తోరణాలు అవి కట్టవా లేదా...ఎక్కడ చచ్చారే అందరూ...పిలిస్తే పలకరేంటి..?....అంటూ తెగ హడావుడి పడుతూ...అందరినీ హడావిడి పెడుతున్నాడు శంకరం.కొడుకు హడావిడి చూసి...శంకరం తల్లి...ఎందుకురా అంత హడావిడి పడుతున్నావు..?అదేంటమ్మా అలా అడుగుతావు....అవతల పెళ్లి వారు బయలుదేరారు. ఇక్కడ చూస్తే ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. కంగారు పడకుండా నింపాదిగా ఉండమంటావ? అన్నాడు విసుక్కుంటూ...ముందు ను వచ్చి ఇలా కూర్చో...అని..తన పక్కన ఉన్న కుర్చీలో కూర్చోపెట్టింది శంకరం తల్లి.ఒరేయ్ శంకరం...నువ్వు కంగారపడకుండా ఉంటే...అన్నీ వాటంతట అవే జరిగిపోతాయి. నీ కొడుకు ఒక్కడు చాలు...అన్ని ఏ లోటు లేకుండా చూసుకోవడానికి. అవును నిజమే...మరి ఏడి నీ ముద్దుల మనవడు...కనపడడేం?? అంటూ ఇల్లంతా కళ్ళతోనే వెతుకుతున్నాడు.ఏం వెతుకుతున్నావురా...? నీ కొడుకునేనా??హమ్... కనిపిస్తే చాలు