*గమనిక:- ఈ కథ కల్పితం, నా ఉహాలు మాత్రేమే ఇది ఎక్కడ జరగలేదు... ఎవరిని ఉద్దేశించి కాదు...ఆమె విధి వంచితురాలు. ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళింది. ఏదైనా కూలి పని ఇప్పించమని అక్కడున్న సూపర్వైజర్ను అడగబోయింది. అంతలోనే అతడిని పోల్చుకుంది. చిన్నప్పుడు మనం కలిసి చదువుకున్నాం కదూ! అని అడిగింది. ఒకరినొకరు గుర్తుపట్టారు. ఆమె కష్టాలు విని అతడు కరిగిపోయాడు. ఆమెకు ఉద్యోగం ఇప్పించాడు. ఉండటానికి కాలనీలో ఇల్లు ఇప్పించాడు. తర్వాత ఇంకా ఏం చేశాడు?పొద్దుపొడిచింది, టైము ఆరైంది.ఓ వ్యక్తి హడావుడిగా పడుతూ లేస్తూ ‘సాహెబ్‌గంజ్’ పోలీస్స్టేషన్లోకొచ్చాడు.సీనియర్ ఇన్స్పెక్టర్ భరత్ భూషణ్ ని చూసి, ‘‘సార్! అవతలివైపు వీధిలో హత్య జరిగింది. దేవిని చంపేశారు’’ కంగారుగా అన్నాడు.భరత్ భూషణ్ ఉలికిపడ్డాడు.‘‘హత్య!? ఎవరు చంపారు? నువ్వు చూశావా? అసలు నువ్వెవరు?’’ గబగబా అడిగాడు.‘‘‘చప్రా’లోని కొన్ని ఇళ్ళకు రోజూ పాలు పోస్తుంటాను. నా పేరు రామ్‌ప్రసాద్. ఇంతకుముందే దేవి ఇంటి ముందు నిలబడి సైకిల్ బెల్