రాత్రి పది గంటల సమయంహఠాత్తుగా మొదలైన వర్షం ఉరుములు మెరుపులతో క్షణక్షణానికి త్రీవంగా కురవసాగింది.వీధిలో జనసంచారమే లేదు.చుట్టుకమ్ముకున్న చీకట్లో వర్షపు జల్లుల శబ్దం తప్ప ఏమీ వినిపించడం లేదు. ఎక్కడో దూరంగా వర్షపు ఉద్వేగానికి భయపడ్డ కుక్కపిల్ల వణికిపోతూ కుంయ్ కుంయ్‌మని ఏడుస్తోంది.అతను ఆమెవైపు కాంక్షగా చూస్తూ అడుగులు వేస్తున్నాడు.ఆమె జింక పిల్లలా వణికిపోసాగింది.అతను ఆమె మీదికి దూసుకుపోయి ఆమెను పట్టుకున్నాడు.ఆమె అతడి చేతులనుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ – ‘‘దుర్మార్గుడా, అంతగా కావాలంటే మధుబాల దగ్గరికి పో’’ అంది ఈసడింపుగా.ఆ మాటలు వినగానే అతను మండిపడ్డాడు. ఆమెను తోసి గదిలో అటుఇటు చూశాడు.ఓ మూలలో కాయగారలు కోసే కత్తి కంటపడింది.పరుగున వెళ్ళి కత్తి అందుకున్నాడు.భయంతో ఆమె కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి.ఆమెను కత్తితో ఆమె మీది లంఘించాడు. ఎడాపెడా ఆమె పొట్టలో కత్తితో నాలుగైదు సార్లు పొడిచాడు.బాధతో ఆమె వేసిన కేకలు బయటి ఉరుముల వర్షపు శబ్దాలలో కలిసిపోయాయి. కొద్ది క్షణాల పాటు