జాహ్నవి...రఘు రామ్ జంట చూడముచ్చటగా ఉంటారు...ఒకరికోసం మరొకరు పుట్టారా అన్నంతగా కలిసిపోయారు...తల్లిదండ్రులు మాట మీరని రఘురాముడు వాళ్ళు మెచ్చిన పిల్లనే తన ఇల్లాలిగా చేసుకున్నాడు...ప్రేమ వివాహం లోనే కాదు పెద్దలు కుదిరించిన వివాహంలోను అనురాగలతో పాటు...తరగని ప్రేమ ఉంటుంది అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు ఇద్దరూ...పెళ్లి అయ్యి ఆరునెలలు దాటింది...ఒక రోజు జాహ్నవి ఉన్నట్టుండి కళ్ళు తిరిగిపడిపోయింది...అత్త మామలు త్వరలో మనవడిని ఎత్తుకోవచ్చు అని సంబరపడిపోయారు...రఘు ఆనందంగా జాహ్నవిని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి చెక్ చేస్తే అలాంటిది ఏమి లేదు అని చెప్పారు...నిరాశగా వెనుదిరిగారు ఆ జంట...ఇంటికి వచ్చాకా పెద్దవాళ్ళకి చెబితే వాళ్ళకి బాధ కలిగిన కూడా తమ బిడ్డలు చిన్న బుచ్చుకున్న మోము చూసి ఇంకా చాలా వయసు ఉంది..మీకు అపుడే ఇలా డిలా పడిపోతారు ఏంటి...ఎం కాదు...అంతా మంచే జరుగుతుంది అని నచ్చచెబితే మనసు కుదుర్చుకున్నారు ఆ జంట...ఆ తరువాత చాలా సార్లు అలాగే జాహ్నవికి తలనొప్పి వచ్చి కళ్ళు